Cycle మీద అసెంబ్లీకి వెళ్లే Charan ?

soundarya

ram charan game changer ntr pawan kalyan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా ఖరారు కాలేదు కానీ షూటింగ్ మొదలై నాలుగో సంవత్సరం గడుస్తున్నా అభిమానులు ఓపికగా ఎదురు చూస్తున్నారు.

దేని వల్ల అయితే ఇంత ఆలస్యం అయ్యిందో ఆ భారతీయుడు 2 జూలై 12 విడుదలకు సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది కనీసం ఓ రెండు మూడు వారాలు రన్ అయ్యాక కానీ చరణ్ మూవీ గురించి క్లారిటీ రాదు. ఇకపోతే దీనికి సంబంధించిన కొన్ని లీకులు మంచి ఆసక్తి రేపెలా ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక కూడా సామాన్యుడికి ప్రతీకగా సైకిల్ మీదే అసెంబ్లీకి వస్తాడట. ఇదేమి తెలుగుదేశం గుర్తుని ప్రతిబింబించే తరహాలో పెట్టనప్పటికీ కథ అందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ వాహనం చుట్టూ ఒక కీలకమైన మలుపు పెట్టడం వల్ల అభిమానులు షాక్ తో కూడిన థ్రిల్ ఫీలవుతారని అంటున్నారు. ఒకప్పుడు నిరాడంబరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్లను ఆధారంగా చేసుకుని ఆపన్న పాత్రని తీర్చిదిద్దినట్టు అంతర్గత సమాచారం.

Cycle మీద అసెంబ్లీకి వెళ్లే Charan ?
Cycle మీద అసెంబ్లీకి వెళ్లే Charan ?

అప్పన్నకు భార్యగా అంజలి నటిస్తోంది. ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుంది. దీని గురించి ఏం మాట్లాడనివ్వకుండా నోరు కుట్టేసిన పరిస్థితుల్లో ఉన్నానని గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్లలో చెప్పిన సంగతి తెలిసిందే. సో చాలా స్పెషల్ గా ఉండబోతోన్న క్లూ అయితే వచ్చేసింది. తమన్ సంగీతం సమకూర్చిన గేమ్ ఛేంజర్ లో శ్రీకాంత్, ఎస్జెసూర్య, సునీల్, జయరాం ఇతర తారాగణం కాగా భరత్ అనే నేను, వినయ విధేయ రామ తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ ఒప్పుకున్న టాలీవుడ్ మూవీ ఇదే. సినిమా విడుదలకు అక్టోబర్ లేదా డిసెంబర్ రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో స్ట్రక్ అయిపోయారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఏమో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ సంగతి చూస్తే ఇదిగో చివరి షెడ్యూల్, అదిగో ఆఖరి దశలో ఉందంటూ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది.

ఇంకెప్పుడో

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు రామ్ చరణ్ కనిపించారు. గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ చెన్నైకి ప్రయాణం అయ్యారు. మరి దీంతోనైనా షూటింగ్‌కి కొబ్బరికాయ కొడతారో లేక ఇంకో షెడ్యూల్ ఉందో చూడాలి. మరోవైవు నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ దసరాకి సినిమాను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామంటూ ఇటీవల ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది కూడా అయ్యేలా కనిపించడం లేదు.

ఇక ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై చరణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అలానే తన కెరీర్‌లో తొలిసారి పొలిటికల్ డ్రామా చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. అలానే చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

లైన్‌లో

Cycle మీద అసెంబ్లీకి వెళ్లే Charan ?
Cycle మీద అసెంబ్లీకి వెళ్లే Charan ?

మరోవైపు చరణ్ ఇటీవల రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్‌లో చేయబోయే RC16 (వర్కింగ్ టైటిల్) సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల లాంఛ్ అయింది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలానే చరణ్ బర్త్‌డేకి ముందే ఇటీవల మరో భారీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వీరి కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Leave a Comment